సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రామారావు డ్యూటీ డేటు ఫిక్సు

ABN, First Publish Date - 2021-12-07T05:44:39+05:30

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మాండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దివ్యాంశ కౌశిక్‌, రజీషా విజయన్‌ కథానాయికలు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మాండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దివ్యాంశ కౌశిక్‌, రజీషా విజయన్‌ కథానాయికలు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రాన్ని  2022 మార్చి 25న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘మార్చి చివరి వారం నుంచి వేసవి సీజన్‌ ప్రారంభం కానుంది. మా సినిమాతోనే ఈ సీజన్‌కి శ్రీకారం చుట్టాలనుకున్నాం. కుటుంబ ప్రేక్షకులంతా చూసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. రవితేజ పాత్ర కొత్త పంధాలో సాగుతుంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింద’’న్నారు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌, కూర్పు: ప్రవీణ్‌ కేఎల్‌, కళ: సాహి సురేష్‌. 


Updated Date - 2021-12-07T05:44:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!