రామ్‌19లో విలన్‌గా నటించడం లేదు

ABN , First Publish Date - 2021-06-13T06:26:20+05:30 IST

రామ్‌ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. అందులో విలన్‌గా మాధవన్‌ నటించనున్నట్టు ప్రచారం...

రామ్‌19లో విలన్‌గా నటించడం లేదు

రామ్‌ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. అందులో విలన్‌గా మాధవన్‌ నటించనున్నట్టు ప్రచారం జరిగింది. తెలుగులో ‘సవ్యసాచి’, ‘నిశ్శబ్దం’ చిత్రాల్లో ఆయన విలన్‌గా నటించారు. ‘రన్‌’, ‘వెట్టై’... లింగుస్వామి దర్శకత్వంలో హీరోగా రెండు చిత్రాలు చేశారు. అందుకని, రామ్‌ చిత్రంలో విలన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారంతా! అయితే, అటువంటిది ఏమీ లేదని మాధవన్‌ స్పష్టం చేశారు. అసలు, ఆ చిత్రంలో తాను నటించడం లేదన్నారు. ‘‘లింగుస్వామితో పని చేయడానికి, అతని దర్శకత్వంలో మళ్లీ మేజిక్‌ క్రియేట్‌ చేయడానికి సిద్ధమే. దురదృష్టవశాత్తూ... నేను విలన్‌గా, లింగుస్వామితో తెలుగు సినిమా చేస్తున్నట్టు చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదు’’ అని మాధవన్‌ ట్వీట్‌ చేశారు. హీరోగా రామ్‌19వ చిత్రమిది. ఇందులో కృతీ శెట్టి హీరోయిన్‌. లాక్‌డౌన్‌ తర్వాత చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.


Updated Date - 2021-06-13T06:26:20+05:30 IST