అమెరికన్ లయన్ ను కలిసిన ఇండియన్ టైగర్ : రామ్ గోపాల్ వర్మ

ABN , First Publish Date - 2021-11-16T22:25:50+05:30 IST

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తన సినిమాలతోనే కాకుండా.. తనదైన ట్వీట్స్ తోనూ నెటిజెన్స్ అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంటూంటారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, పూరీ చిత్రం ‘లైగర్’ సినిమా గురించి తాజాగా ఆయన పెట్టిన ట్వీట్ .. వైరల్ గా మారింది. ఈ రోజు (మంగళవారం) విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రం అమెరికా షెడ్యూల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్, విజయ్ దేవరకొండ మీద కీలక దృశ్యాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా.. హీరో విజయ్ తొలిసారిగా మైక్ టైసన్ ను తొలిసారిగా సెట్స్ లో కలుసుకున్నారు.

అమెరికన్ లయన్ ను కలిసిన ఇండియన్ టైగర్ : రామ్ గోపాల్ వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తన సినిమాలతోనే కాకుండా.. తనదైన ట్వీట్స్ తోనూ నెటిజెన్స్ అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంటూంటారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, పూరీ చిత్రం ‘లైగర్’  సినిమా గురించి తాజాగా ఆయన పెట్టిన ట్వీట్ .. వైరల్ గా మారింది. ఈ రోజు (మంగళవారం) విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రం అమెరికా షెడ్యూల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్, విజయ్ దేవరకొండ మీద కీలక దృశ్యాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా.. హీరో విజయ్ తొలిసారిగా మైక్ టైసన్ ను తొలిసారిగా సెట్స్ లో కలుసుకున్నారు. దాంతో బాగా ఎగ్జయిటవుతూ.. విజయ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మైక్ టైసన్, తను దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆ ఫోటో పై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘ లాస్ వెగాస్ లో పూరీ జగన్నాథ్ ‘లైగర్’ సినిమా లొకేషన్ షూట్ లో అమెరికన్ లయన్ మైక్ టైసన్‌ను కలిసిన ఇండియన్ టైగర్ విజయ్ దేవరకొండ. దీన్నే నేను పంచ్ పవర్ అంటాను’. అంటూ వర్మ ట్వీట్ చేశారు. తన శిష్యుడు పూరీ ఈ సినిమాకి దర్శకుడు కాబట్టి... వర్మ ఈ విధంగా పాజిటివ్ గా స్పందించారని  అర్ధం అవుతోంది. Updated Date - 2021-11-16T22:25:50+05:30 IST