సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ram Gopal Varma: 'పుష్ప' ట్రైలర్‌పై సెన్షేషనల్ కామెంట్స్..

ABN, First Publish Date - 2021-12-07T14:49:58+05:30

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తాజాగా విడుదలైన 'పుష్ప' మూవీ ట్రైలర్‌పై తనదైన శైలిలో సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్‌లుగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తాజాగా విడుదలైన 'పుష్ప' మూవీ ట్రైలర్‌పై తనదైన శైలిలో సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్‌లుగా.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సమంత స్పెషల్ సాంగ్‌లో, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ నెల 17న 5 భాషలలో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్రబృందం తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన ఆర్జీవీ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించాడు. "ఇలాంటి రియలిస్టిక్ పాత్రలో నటించడానికి భయపడని సూపర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే.. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజినీకాంత్ లాంటి వారు ఇలాంటి పాత్రలు చేయగలరా.." అని  ట్వీట్ చేశాడు. అంతేకాదు "పుష్ప అంటే ప్లవర్ కాదు.. ఫైర్" అని ట్రైలర్‌లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌ను రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-12-07T14:49:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!