సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Saidharam teja : ‘రిపబ్లిక్’ మూవీ టీమ్ కు రామ్ చరణ్ విషెస్

ABN, First Publish Date - 2021-09-26T18:16:12+05:30

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘రిపబ్లిక్’. దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సందేశాత్మక చిత్రంలో రమ్యకృష్ణ విశాఖ వాణి అనే పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గానూ, మరో కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘రిపబ్లిక్’. దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సందేశాత్మక చిత్రంలో రమ్యకృష్ణ విశాఖ వాణి అనే పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గానూ, మరో కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ను అక్టోబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రచారంలో భాగంగా నిన్ననే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా  చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. తన బావ సాయిధరమ్ తేజ కు,  ‘రిపబ్లిక్’ మూవీ టీమ్ కు ట్విట్టర్ వేదికగా  విషెస్ తెలిపారు.



‘డియర్ బ్రదర్ సాయిధరమ్ తేజకి, ‘రిప్లబిక్’ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ . మీ అందరినీ అక్టోబర్ 1 న థియేటర్స్ లో కలుస్తానని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిన వెంటనే ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీతో థియేట్రికల్ రిలీజ్ తో వచ్చిన  సాయిధరమ్..  ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత కూడా ‘రిపబ్లిక్’ మూవీతో థియేటర్స్ లోనే సందడి చేయనుండడం విశేషంగా మారింది. 




Updated Date - 2021-09-26T18:16:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!