రామ్‌చరణ్: ఆ బ్రదర్హుడ్ని చనిపోయే వరకూ మనసులో పెట్టుకుంటా
ABN , First Publish Date - 2021-12-28T22:51:52+05:30 IST
జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్) ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రస్తుతం రాజమౌళి టీమ్ సినిమా విడుదల కానున్న అన్ని భాషలకు సంబంధించిన ప్రమోషన్లో బిజీగా ఉన్నారు.

చిన్నపిల్లాడి మనస్తత్వం.. సింహం లాంటి ఆకారం!
తారక్‌కు థ్యాంక్స్ చెబితే బంధం ముగిసిపోతుందనే భావన!
- రామ్‌చరణ్
జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్) ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రస్తుతం రాజమౌళి టీమ్ సినిమా విడుదల కానున్న అన్ని భాషలకు సంబంధించిన ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. సోమవారం తమిళనాట ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేదికపై రామ్‌చరణ్ ఎమోషనల్‌గా మాట్లాడారు. ఎన్టీఆర్ గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తారక్‌కు నాకు వయసులో ఏడాది తేదా. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం.. సింహం లాంటి ఆకారం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొదటి నుంచి మేమిద్దరం స్నేహితులమే అయినా ఈ సినిమాతో మా ఇద్దరి మఽధ్య బాండింగ్ బాగా పెరిగింది. ఆయనతో ఉన్న అనుబంధానికి థ్యాంక్స్ చెప్పి సరిపెట్టుకోలేను. తారక్‌లాంటి బ్రదర్‌ని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. తారక్‌కు థ్యాంక్స్ చెబితే మా బంధం ముగిసిపోతుందనే భావన నాకు. అందుకే నేను చనిపోయేవరకు ఆ బ్రదర్ హుడ్‌ని నా మనసులో పెట్టుకుంటాను’ అంటూ చరణ్ అన్నారు. అలాగే రాజమౌళి గురించి కూడా చరణ్ మాట్లాడారు. ‘‘మా క్రియేటర్‌ని ఏమని పిలవాలి.. గురువు అనాలా? హెడ్ మాస్టర్ అనాలా? ప్రిన్సిపాల్ అని పిలవాలా? గైడ్ అనాలా.. నాకు ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనాలా తెలియడం లేదు. మంచి సినిమాతోపాటు నాకు తారక్‌లాంటి సోదరుణ్ణి ఇచ్చారు’’ అని అన్నారు. చెర్రీ మాటలతో రాజమౌళి, తారక్ ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు.