'మోసగాళ్లు' టీమ్‌కు చరణ్ అభినందనలు
ABN, First Publish Date - 2021-03-20T17:58:37+05:30
విష్ణు మంచు హీరోగా జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మోసగాళ్లు'. మార్చి 19న పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన 'మోసగాళ్లు' యూనిట్‌ను అభినందిస్తూ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ట్వీట్ చేశారు
విష్ణు మంచు హీరోగా జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మోసగాళ్లు'. మార్చి 19న పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన 'మోసగాళ్లు' యూనిట్‌ను అభినందిస్తూ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ట్వీట్ చేశారు. "'మోసగాళ్లు' యూనిట్‌కు అభినందనలు. సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ గురించి విన్నాను. నా సోదరుడు విష్ణు మంచు, సునీల్ శెట్టిగారితో పాటు కాజల్ అగర్వాల్ సహా ఇతర యూనిట్ సభ్యులందరూ అద్భుతంగా నటించారు. ఈ ఎంగేజింగ్ థ్రిల్లర్‌ను తప్పక చూడండి" అని ట్విట్టర్‌లో తెలిపారు రామ్‌చరణ్. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్ పతాకాలపై నిర్మితమైన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. విష్ణు మంచు అక్కయ్య పాత్రలో ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించింది. అమెరికాలో జరిగిన అతి పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సీనియర్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.