‘అర్ధశతాబ్దం’కు రకుల్ ప్రీత్ సింగ్ సపోర్ట్
ABN, First Publish Date - 2021-02-13T23:00:01+05:30
‘అర్ధశతాబ్దం’ చిత్రానికి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సపోర్ట్ అందించారు. చిత్రంలోని పాటను ఆమె చేతుల మీదుగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కార్తిక్ రత్నం
‘అర్ధశతాబ్దం’ చిత్రానికి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సపోర్ట్ అందించారు. చిత్రంలోని పాటను ఆమె చేతుల మీదుగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో.. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అర్ధశతాబ్దం’. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఒక బర్నింగ్ ప్రాబ్లమ్‌ని మెయిన్ పాయింట్‌గా తీసుకొని నేటి ట్రెండ్‌కి తగ్గట్లుగా, కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి రవీంద్ర పుల్లే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అందరి అంచనాలకు ధీటుగా రవీంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.. నౌపల్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని 'ఏ కనులు చూడని చిత్రమే' పాటని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేశారు. ప్రస్తుతం తన పాటలతో మ్యూజిక్ శ్రోతలను అలరిస్తున్న ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ పాటని ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సాంగ్ మార్కెట్లోకి రిలీజ్ అయింది.
సాంగ్ విడుదల అనంతరం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ''అర్దశతాబ్దం పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ చూశాను. చాలా బాగున్నాయి. ఏ కనులు చూడని చిత్రమే సాంగ్ వింటుంటే మెలోడియస్, రొమాంటిక్ ఫీల్ వస్తుంది. అష్కర్ ఫోటోగ్రఫీ సూపర్బ్‌గా ఉంది. విజువల్స్ అన్నీ ఎక్స్ ట్రార్డినరీగా ఉన్నాయి. ఈ సినిమా బిగ్ హిట్టై యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.." అన్నారు.
నిర్మాతలు చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ మాట్లాడుతూ.. ''మా సినిమాకు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. సాంగ్ విడుదల చేసిన రకుల్ ప్రీత్ గారికి ధన్యవాదాలు. మా దర్శకుడు రవీంద్ర అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం.." అన్నారు.