రాజమౌళి విజనే కారణం

ABN , First Publish Date - 2021-12-27T06:30:23+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి పాన్‌ ఇండియా చిత్రం తీయడం కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే ఘనత’’ అన్నారు రామ్‌చరణ్‌. జనవరి 7న విడుదలవుతున్న...

రాజమౌళి విజనే కారణం

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి పాన్‌ ఇండియా చిత్రం తీయడం కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే ఘనత’’ అన్నారు రామ్‌చరణ్‌. జనవరి 7న విడుదలవుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచార కారక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘తెలుగులో అగ్రహీరోలు కలసినటించడం అనేది చాలా అరుదు. అలాంటి సమయంలో ఎన్టీఆర్‌ను, నన్ను కలిపి సినిమా తీస్తాననడం షాకింగ్‌గా అనిపించింది. నేను ఈ సినిమా అంగీకరించడానికి ప్రధాన కారణం రాజమౌళి. మా హీరోల ఇద్దరి స్టార్‌డమ్‌, బడ్జెట్‌ అంచనాలను ఎలా బ్యాలెన్స్‌ చేస్తారనిపించింది. కానీ రాజమౌళి విజన్‌ వాటన్నింటికి మించి ఉంటుంది. ఆ నమ్మకమే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఎన్టీఆర్‌ను నన్ను ముందుకు నడిపించింది’’ అన్నారు. 


Updated Date - 2021-12-27T06:30:23+05:30 IST