రాజమౌళి: ‘పవన్‌ కల్యాణ్‌’ అంటే ఎలాగైతే అరుస్తారో..!

ABN , First Publish Date - 2021-11-01T02:21:22+05:30 IST

‘‘సినిమా దర్శకుణ్ణి కాకపోయి ఉంటే డ్రైవర్‌ని అయ్యేవాడినేమో! ఎందుకంటే నాకు డ్రైవింగ్‌ బాగా వచ్చు. అయితే నేను ‘శాంతినివాసం’ సీరియల్‌ చేస్తున్న సమయంలోనే పదేళ్ల తర్వాత కచ్చితంగా పెద్ద దర్శకుడిని అవుతానని అనిపించింది. అది నేను ముందే ఊహించా’’ అని దర్శకుధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు. ఇటీవల ఆయన ఓ కాలేజ్‌ ఫెస్ట్‌కి అతిథిగా హాజరయ్యారు. అక్కడ స్టూడెంట్స్‌ అడిగిన ప్రశ్నలకు జక్కన్న ఆసక్తికర సమాధానాలిచ్చారు.

రాజమౌళి: ‘పవన్‌ కల్యాణ్‌’ అంటే ఎలాగైతే అరుస్తారో..!

‘పవన్‌ కల్యాణ్‌’ అంటే ఎలాగైతే అరుస్తారో... 

మెల్‌ గిబ్సన్‌ పేరు చెబితే అంతకు పది రెట్లు గట్టిగా అరుస్తా!

ఒక్క సీన్‌కే రూ. 75 లక్షల ఖర్చు...

అలా చూపిస్తే.. అభిమానులు ఊరుకుంటారా? 

– రాజమౌళి

‘‘సినిమా దర్శకుణ్ణి కాకపోయి ఉంటే డ్రైవర్‌ని అయ్యేవాడినేమో! ఎందుకంటే నాకు డ్రైవింగ్‌ బాగా వచ్చు. అయితే నేను ‘శాంతినివాసం’ సీరియల్‌ చేస్తున్న సమయంలోనే పదేళ్ల తర్వాత కచ్చితంగా పెద్ద దర్శకుడిని అవుతానని అనిపించింది. అది నేను ముందే ఊహించా’’ అని దర్శకుధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు.  ఇటీవల ఆయన ఓ కాలేజ్‌ ఫెస్ట్‌కి అతిథిగా హాజరయ్యారు. అక్కడ స్టూడెంట్స్‌ అడిగిన ప్రశ్నలకు జక్కన్న ఆసక్తికర సమాధానాలిచ్చారు. 


మీ సక్సెస్‌ సీక్రెట్‌? 

ఏ రంగంలో అయిన విజయం సాధించాలంటే తగిన ప్రయాణం అవసరమని మొదటి నుంచి నమ్ముతాను.  ఏ కథ అయినా నన్ను ప్రేమించాలి. అప్పుడే దాన్ని తెరకెక్కిస్తా. ఈ ప్రయాణమే విజయాల్ని అందిస్తుందని నా నమ్మకం. ఈ జర్నీలో నాకు చాలా మంది స్ఫూర్తిగా నిలిచారు. ఒక్కో సమయంలో ఒక్కో దర్శకుడు నాకు ఇన్స్పిరేషన్‌. నా సృజనాత్మకతని బయటకి తీసుకొచ్చేలా చేసింది మెల్‌ గిబ్సన్‌. ఆయన విజన్‌, టేకింగ్‌ స్టైల్‌ అంటే బాగా ఇష్టం. ‘పవన్‌ కల్యాణ్‌’ పేరు చెప్పగానే జనాలు ఎలాగైతే అరుస్తారో... మెల్‌ గిబ్సన్‌ పేరు చెబితే నేను అంతకు పది రెట్లు గట్టిగా అరుస్తా. 


పిల్లలు చూసే సినిమాలు తీస్తారా? 

‘బాహుబలి’.. అంతగా విజయం సాధించడానికి చిన్న పిల్లలూ ఒక కారణం. పెద్దవారితోపాటు చిన్నపిల్లలు చూేస సినిమాలు తీయాలనేది నా కోరిక. అలాంటి సినిమాలు తీస్తున్నాననే అనుకుంటున్నా. 


ఆర్‌ఆర్‌ఆర్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను 30 నిమిషాలే కనిపిస్తారాట? 

అలా చూపిేస్త అభిమానులు ఊరుకుంటారా? ఈ విషయాలు ఇప్పుడు మాట్లాడలేను. 


షెడ్యూల్‌ డిలే అయితే ఎలా ఫీలవుతారు? 

సన్నివేశం అనుకున్నట్లు రాకపోయినా, డిలే అయినా ఆ క్షణంలో డబ్బు గురించే ఆలోచిస్తాను. ఎందుకంటే షెడ్యూల్‌ ఆలస్యమైతే ఆ నష్టం నిర్మాతకే! ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయానికొేస్త రాత్రిపూట చిత్రీకరించే ఒక్క సీన్‌కే రూ. 75 లక్షలు ఖర్చవుతుంది. ఎవరి వల్ల పొరపాటు జరిగినా వాతావరణం అనుకూలించక పోయినా ఖర్చంతా వృథా అవుతుంది. 


‘మహాభారతం’ ఎప్పుడు? 

‘మహాభారతం’ లాంటి సినిమా తెరకెక్కించాలంటే సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం. ఇప్పుడున్న టెక్నాలసీ కన్నా ఎక్కువ అవసరం. నా ప్రతి సినిమాలోనూ సాంకేతికతను పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మనసులో ఉన్న విజువల్స్‌ని తెరపై చూపించగలననే నమ్మకం వచ్చినప్పుడు ఆ సినిమా మొదలుపెడతాను.


పవన్‌కల్యాణ్‌తో సినిమా ఆలోచన పక్కన పెట్టారా? 

పవన్‌కల్యాణ్‌గారంటే నాకు చాలా గౌరవం. ఆయనతో సినిమా తీయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నా. ఒకసారి షూటింగ్‌లో కలిశాను. సమయం ఇేస్త కథ చెబుతా అన్నాను. అలా ఏడాదిన్నర కాలం గడిచింది. ఆయన నుంచి ఎలాంటి ఫోన్‌ రాలేదు. ఆయన వేరే సినిమాలతో బిజీ అయ్యారు. నా ఆలోచన మారింది. ఆయనతో మాస్‌ సినిమా కాదు ఎక్కువ మందికి చేరువయ్యే భారీ తీయాలనిపించింది. అలా ‘మగధీర’, ‘యమదొంగ’ వంటి చిత్రాలు వచ్చాయి. అదే సమయంలో ఆయన రాజకీయాలపై దృష్టిపెట్టారు. మా ఇద్దరి దారులు వేరయ్యాయి. మహేశ్‌తో సినిమా గురించి కూడా ఇప్పుడేమీ చెప్పలేను. 


ఇతర దేశాల్లో ఎంత పెద్ద సినిమానైనా ఏడాది లోపు పూర్తి చేస్తున్నారు. మీరు 2–5 ఏళ్లు తీసుకుంటున్నారు?

పూరి జగన్నాథ్‌ని పక్కనపెడితే ఆరు నెలల్లో ఎవరూ సినిమా పూర్తి చేయలేరు. ఆయన మహానుభావుడు. అంత తక్కువ సమయంలో ఆయన ఎలా తీస్తాడో ఇప్పటికీ నాకు తెలియదు. ఆరు నెలల్లో సినిమా తీయడమనేది అసాధ్యం.  షూటింగ్‌ తక్కువ సమయంలో పూర్తి చేయొచ్చు. కానీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో ఆలస్యమవుతుంది. హాలీవుడ్‌లో కూడా భారీ ప్రాజెక్ట్‌లకు సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు పడుతుంది. 


Updated Date - 2021-11-01T02:21:22+05:30 IST