సూపర్ హీరో చిత్రాన్ని ప్రశంసించిన రాజమౌళి

ABN , First Publish Date - 2021-12-30T16:05:09+05:30 IST

ప్రస్తుతం ఓటీటీ చిత్రాల్లో అందరి ప్రశంసలు పొందుతున్న చిత్రం ‘మిన్నల్ మురళి’. అతి తక్కువ బడ్జెట్ లో గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన ఈ మలయాళ సూపర్ హీరో చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వెర్షన్స్ లో కూడా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. టోవినో థామస్ హీరోగా, తమిళ విలక్షణ నటుడు గురు సోమసుందరం విలన్ గా నటించిన ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులూ ఎంజాయ్ చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు.

సూపర్ హీరో చిత్రాన్ని ప్రశంసించిన రాజమౌళి

ప్రస్తుతం ఓటీటీ చిత్రాల్లో అందరి ప్రశంసలు పొందుతున్న చిత్రం ‘మిన్నల్ మురళి’. అతి తక్కువ బడ్జెట్ లో గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన ఈ మలయాళ సూపర్ హీరో చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వెర్షన్స్ లో కూడా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. టోవినో థామస్ హీరోగా, తమిళ విలక్షణ నటుడు గురు సోమసుందరం విలన్ గా నటించిన ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులూ ఎంజాయ్ చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసిస్తే వచ్చే కిక్కే వేరు కదా. నిన్న (బుధవారం) రాజమౌళి, యన్టీఆర్, రామ్ చరణ్ తదితర చిత్ర బృందం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ప్రమోషన్స్ ను తిరువనంతపురంలో జరిపారు. దీనికి టోవినో థామస్ ను స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజమౌళి టోవినో నటించిన ‘మిన్నల్ మురళి’ చిత్రం పై ప్రశంసల జల్లులు కురిపించారు.


‘మిన్నల్ మురళి’ చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్ తో అద్బుతంగా తీశారని, సినిమా తనకి బాగా నచ్చిందని, ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని రాజమౌళి తెలిపారు. దాంతో ‘మిన్నల్ మురళి’ టీమ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఒకే టైమ్ లో పడిన పిడుగుదెబ్బకి హీరో కి, విలన్ కు  శక్తులు లభిస్తాయి. తన శక్తులతో హీరో ఒక గ్రామాన్ని కాపాడాలనుకుంటే.. విలన్ నాశనం చేయాలనుకుంటాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలాచారన్నది మిగతా కథ. ఇందులో హీరో కన్నా ఎక్కువ మార్కులు కొట్టేశారు విలన్ గా నటించిన గురు సోమసుందరం. 

Updated Date - 2021-12-30T16:05:09+05:30 IST