నిర్మాతలు: కార్తికేయ కెరీర్‌ బెస్ట్‌ సినిమా అవుతుంది

ABN , First Publish Date - 2021-11-01T00:53:42+05:30 IST

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఆదిరెడ్డి.టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు సినిమా విశేషాలను ముచ్చటించారు.

నిర్మాతలు: కార్తికేయ కెరీర్‌ బెస్ట్‌ సినిమా అవుతుంది

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా  పరిచయం చేస్తూ... ఆదిరెడ్డి.టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు సినిమా విశేషాలను ముచ్చటించారు. 


ఆదిరెడ్డి మాట్లాడుతూ ‘‘దేవిశ్రీప్రసాద్‌గారిది మాది ఒకటే ఊరు. నేను, రామారెడ్డి వాపార్యంలో స్నేహితులం. ఇద్దరి అభిరుచులు ఒకటే! అందుకే కలిసి సినిమా చేశాం. మా ఇద్దరికీ ఇష్టమైన హీరో చిరంజీవిగారు. నిర్మాతల్లో డాక్టర్‌ రామానాయుడుగారు ఆదర్శం. న్యూ ఏజ్‌ స్టయిలిష్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ఇది. హీరో కార్తికేయ ఎన్‌ఐఏ అధికారిగా కనిపిస్తారు. వినోదం, ప్రేమ కూడా మిళితమై ఉన్నాయి. కార్తికేయ ఈ చిత్రం కోసం పడ్డ కష్టాన్ని మాటల్లో చెప్పలేను. కార్తికేయ ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు... ఈ సినిమా మరో ఎత్తు. సినిమా విడుదలైన తర్వాత కార్తికేయ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. థియేట్రికల్‌ అనుభూతి ఇవ్వడం కోసం ఇంతకాలం ఎదురుచూశాం. ఓటీటీకి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆంధ్రాలో కొన్ని ఏరియాలు అమ్మేశాం. కొన్ని ఏరియాలు మా దగ్గరే ఉన్నాయి. నైజాం ఏరియాలో సొంతంగా మేమే విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. 


‘88’ రామారెడ్డి మాట్లాడుతూ ‘‘డిస్ట్రిబ్యూటర్‌ వినోద్‌ రెడ్డిగారి ద్వారా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. అదే విషయం ఆదిరెడ్డికి చెప్పాను ఇద్దరికీ నచ్చడంతో సినిమా మొదలుపెట్టాం. నిర్మాతగా ‘రాజా విక్రమార్క’ నా తొలి సినిమా. ఆదిరెడ్డిగారు ఇంతకు ముందు కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఆ అనుభవంతోనే ధైర్యంగా ఈరంగంలో అడుగుపెట్టాం. టీజర్‌ విడుదల చేశాక వచ్చిన స్పందనతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. దర్శకుడు గతంలో ఓ హాలీవుడ్‌ సినిమాకు పని చేశారు.  ఈ సినిమాను ఆ స్టాండర్స్ట్‌ తగ్గకుండా తెరకెక్కించారు. హిందీ రైట్‌ 3.25 కోట్లకు కొనుగోలు చేశారు. తమిళ ప్రేక్షకుల నుంచీ మంచి స్పందన వస్తోంది. రాబోయే ట్రైలర్‌ మాత్రమే కాదు సినిమా కూడా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. కార్తికేయ కెరీర్‌ బెస్ట్‌ సినిమా అవుతుంది. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తాం’’ అని చెప్పారు. 


Updated Date - 2021-11-01T00:53:42+05:30 IST