త్వరలో టీవీలో ప్రసారం కానున్న ‘రాజ రాజ చోర’

ABN , First Publish Date - 2021-11-01T17:37:44+05:30 IST

టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రాజ రాజ చోర’. మొన్నామధ్య థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద మ్యాజిక్ చేసింది. కథాకథనాలు చాలా వెరైటీగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఓటీటీలోనూ ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.

త్వరలో టీవీలో ప్రసారం కానున్న ‘రాజ రాజ చోర’

టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రాజ రాజ చోర’. మొన్నామధ్య థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద మ్యాజిక్ చేసింది. కథాకథనాలు చాలా వెరైటీగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఓటీటీలోనూ ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.

ఇక ఇప్పుడు ‘రాజరాజ చోర’ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షో కి కూడా రెడీ అవుతోంది. జీ తెలుగులో త్వరలోనే సినిమాను ప్రసారం చేయబోతున్నారు. సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు టీవీలో ఎప్పుడు ప్రసారం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే ఆ కోరిక తీరబోతోందని మేకర్స్ చెబుతున్నారు.  ఈ సినిమా టీవీ ప్రసారం గురించి అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి ఈ సినిమాకి టీఆర్పీ ఎంత వస్తుందో చూడాలి. 

Updated Date - 2021-11-01T17:37:44+05:30 IST