శ్రీవిష్ణు సినిమా నుంచి సాంగ్ వచ్చెన్
ABN , First Publish Date - 2021-07-29T02:19:40+05:30 IST
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ బ్యానర్లపై హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన వన్నీ సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ బ్యానర్లపై హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన వన్నీ సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రాజ రాజు వచ్చే లోకాలు మెచ్చే’ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘దొరలని మీకు మీరు దొరులుతు తిరిగారు.. చొరబడి చెడిపోతే చతికిల పడతారు.. రాజ రాజు వచ్చే లోకాలు మెచ్చే’ అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ సంగీతం అందించగా.. హసిత్ గోలి సాహిత్యం అందించారు. మోహన భోగరాజు ఆలపించారు. ఈ పాట సోషల్ మీడియాలో మంచి స్పందనను రాబట్టుకుంటోంది. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన మేఘా ఆకాష్ నటిస్తుండగా సునైన, తనికెళ్ళభరణి, గంగవ్వ, అజయ్ ఘోష్ మొదలగువారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. టీవీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రానికి నిర్మాతలు.