లండన్‌లో రెండోడోసు టీకా వేయించుకున్న రాధికాఆప్టే

ABN , First Publish Date - 2021-06-23T11:51:39+05:30 IST

ప్రముఖ సినీనటి రాధికా ఆప్టే కొవిడ్ -19 రెండో డోసు టీకా వేయించుకున్నారు....

లండన్‌లో రెండోడోసు టీకా వేయించుకున్న రాధికాఆప్టే

లండన్ (యూకే) : ప్రముఖ సినీనటి రాధికా ఆప్టే కొవిడ్ -19 రెండో డోసు టీకా వేయించుకున్నారు. తాను నెల రోజుల క్రితం మొదటి డోసు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నానని, నెలరోజుల తర్వాత రెండవ టీకా షాట్ తీసుకున్నానని రాధికా ఆప్టే తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. లండన్ నగరంలో ఉన్న రాధికా ఆప్టే ఇంటి తోటలో పింక్ టాప్, బ్లూ జీన్స్ ధరించి కాఫీ కప్పుతో కూర్చొని, రెండు టీకాలు వేయించుకున్నానని సూచనగా చేతివేళ్లతో సంకేతాలు ఇచ్చారు. తన భర్త బెనెడిక్ట్ టేలర్ స్వస్థలమైన లండన్ నగరంలో ఉన్న రాధికా యునైటెడ్ కింగ్ డమ్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అయిన నేషనల్ హెల్త్ సర్వీస్ లాంగ్ లైవ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను రాధిక ఉపయోగించారు.

Updated Date - 2021-06-23T11:51:39+05:30 IST