సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'రాధేశ్యామ్': రికార్డు స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్..!

ABN, First Publish Date - 2021-10-27T16:11:32+05:30

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన భారీ బడ్జెట్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ మూవీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడైనట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించిన పీరియాడిక్ లవ్ స్టోరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన భారీ బడ్జెట్ మూవీ  'రాధేశ్యామ్'. ఈ మూవీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడైనట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించిన పీరియాడిక్ లవ్ స్టోరీ ఇప్పటికే టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈమూవీ ప్రమోషన్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిజినెస్ వ్యవహారాలు కూడా మొదలయ్యాయట. ఆర్డి ఇల్యూమినేషన్ తాజాగా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. కరోనా తరువాత అత్యంత భారీ ధరకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడైన మూవీ “రాధేశ్యామ్” అని టాక్ వినిపిస్తోంది. ఇక మరో టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. ఈసారి వచ్చే రెండవ టీజర్ హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించిన వీడియో అని.. దీపావళి పండుగ రోజున ఈ స్పెషల్ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై వంశీ - ప్రమోద్ - ప్రసీద నిర్మిస్తున్న ఈ చిత్రం 2022, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Updated Date - 2021-10-27T16:11:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!