Radhe shyam: వైజాగ్ నుంచి మ్యూజికల్ టూర్ మొదలు..

ABN , First Publish Date - 2021-12-29T17:23:04+05:30 IST

ఇండియన్ సినిమాలో ప్రస్తుతం అభిమానులు అత్యంత ఆసక్తికరంగా వేచి చూస్తున్న సినిమాలలో ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ కూడా ఒకటి. రాధాకృష్ణ కుమార్ ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కించారు.

Radhe shyam: వైజాగ్ నుంచి మ్యూజికల్ టూర్ మొదలు..

ఇండియన్ సినిమాలో ప్రస్తుతం అభిమానులు అత్యంత ఆసక్తికరంగా వేచి చూస్తున్న సినిమాలలో ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ కూడా ఒకటి. రాధాకృష్ణ కుమార్ ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కించారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్, టీ సిరీస్ పతాకాలపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జనవరి 14న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా రాధే శ్యామ్ మ్యూజికల్ టూర్ వైజాగ్ నుంచి మొదలైంది. దీనికోసం చుట్టూ పోస్టర్స్ తో ఉన్న ఒక వాహనాన్ని సిద్ధం చేశారు. ఇది కూడా అభిమానులతో లాంచ్ చేయించారు. సినిమాకు సంబంధించిన ప్రతి మేజర్ విషయాన్ని అభిమానులతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రభాస్ అండ్ టీం. జనవరి 7 నుంచి ప్రభాస్ ప్రమోషన్స్ లో భాగం కానున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చిత్ర యూనిట్ స్తోంది. దీనికోసం నేషనల్ మీడియాతో కూడా ప్రభాస్ మాట్లాడనున్నారు. భారీ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు రాధే శ్యామ్ టీం. దీనికి హీరో ప్రభాస్ కూడా తన 100% ఎఫర్ట్ పెడుతున్నారు. చిత్ర యూనిట్ కూడా ఇప్పటి నుంచి మీడియాకు ప్రమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో వస్తున్న మొదటి లవ్ స్టోరీ రాధే శ్యామ్ విశేషం. 





Updated Date - 2021-12-29T17:23:04+05:30 IST