Radhe shyam: అందులో నిజం లేదని స్పష్ఠం చేసిన మేకర్స్
ABN, First Publish Date - 2021-09-22T17:24:30+05:30
పాన్ ఇండియన్ స్టార్ ప్రభా, మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న మూవీ 'రాధేశ్యామ్'. ఈ మూవీలో నటిస్తున్న పూజా హెగ్డే, ప్రభాస్‌ల మధ్య విభేదాలు తలెత్తాయని,
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న మూవీ 'రాధేశ్యామ్'. ఈ మూవీలో నటిస్తున్న పూజా హెగ్డే, ప్రభాస్‌ల మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే కొన్ని సీన్స్ విడి విడిగా చిత్రీకరించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు మేకర్స్ దృష్ఠికి వెళ్ళడంతో వారు దీనిపై స్పందించారు. తాజాగా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడిన వారు.."ప్రభాస్, పూజాహెగ్డేకు పడట్లేదని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ కేవలం రూమర్సనని ఇద్దరూ బాగున్నారని చెప్పారు. ప్రభాస్ - పూజాల ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతమని, ఈ జంట తెరపై అందరినీ అలరించడం ఖాయమని తెలిపారు".
ఇక సెట్లో పూజా హెగ్డే ప్రవర్తన, షూటింగ్‌కు లేట్‌గా రావడం వంటి విషయాలపై కూడా మేకర్స్ రియాక్ట్ అవుతూ.."పూజ మంచి టైం సెన్స్ పాటిస్తుందని, ఆమెతో పని చేయడం కంఫర్ట్‌గా ఉంటుంది"..అని అన్నారు. దీంతో ఇప్పటి వరకు వచ్చినవన్ని కల్పించిన వార్తలేనని క్లారిటీ వచ్చేసింది. కాగా ఈ 1970ల కాలంలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. రాధకృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమాను వంశీ - ప్రమోద్ - ప్రశీద కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.