'రాధే శ్యామ్': అదిరిపోయిన లేటెస్ట్ అప్‌డేట్..
ABN, First Publish Date - 2021-11-28T17:18:37+05:30
'రాధే శ్యామ్' మూవీ నుంచి తాజాగా అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరీని యువ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించాడు.
'రాధే శ్యామ్' మూవీ నుంచి తాజాగా అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరీని యువ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించాడు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను 7 భాషలలో కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 'రాధే శ్యామ్' చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు.
దీనికి సంబంధించిన సాంగ్ టీజర్‌ను రేపు సాయంత్రం తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో సాయంత్రం 7 గంటలకు.. అలాగే, హిందీ వెర్షన్ టీజర్‌ను మధ్యాహ్నం 1 గంటకు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభాస్ - పూజా హెగ్డేలతో కూడుకున్న ఓ సరికొత్త పోస్టర్‌ను వదిలారు. ఇక హిందీ భాషకు మనన్ భరద్వాజ్, సౌత్ భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.