‘రావే నా చెలియా’ ట్రైలర్ విడుదల

ABN , First Publish Date - 2021-08-05T23:24:38+05:30 IST

ఇటీవల మృతి చెందిన నెమలి సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏడు నెలల క్రితం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా

‘రావే నా చెలియా’ ట్రైలర్ విడుదల

నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ హీరో హీరోయిన్లుగా సూర్య చంద్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘రావే నా చెలియా’. ఇటీవల మృతి చెందిన నెమలి సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏడు నెలల క్రితం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇటీవల థియేటర్స్ మళ్లీ తెరుచుకోవడంతో ఆగస్టు 13న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు చంద్రకాంత్ ట్రైలర్ విడుదల చేయగా.. సినిమాలోని మొదటి పాటను నటుడు కృష్ణతేజ్ విడుదల చేశారు. మరో పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ పాల్ విడుదల  చేశారు.


ఈ సందర్భంగా నటుడు చంద్రకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి ప్రొడక్ట్ ఇచ్చి చూడకుండానే నిర్మాత చనిపోవడం చాలా బాధాకరం. మంచి సబ్జెక్ట్‌తో ముందుకొచ్చిన డైరెక్ట్ మహేశ్వర్ రెడ్డికి మరెన్నో మంచి అవకాశాలు రావాలి. చిత్ర మంచి విజయం సాధించాలి’’ అని తెలుపగా.. ఆగస్ట్ 13న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నాము. ఈ చిత్రానికి టీమ్ అందించిన సపోర్ట్ మరిచిపోలేను. తెలుగు ప్రేక్షకులు చిత్రాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు దర్శకుడు. ‘‘మా అబ్బాయి హీరోగా సంవత్సరానికి మూడు సినిమాలు చేయాలని, అదే నా కోరిక అని నిర్మాత సురేష్‌గారు అనేవారు. ఇప్పుడు చిత్రం విడుదలవుతున్న సమయంలో ఆయన లేకపోవడం బాధగా ఉంది. ఎన్ని కష్టాలు ఉన్నా సినిమా విడుదల వరకు తీసుకొచ్చిన హీరో నెమలి అనిల్‌ను, డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డిని అభినందిస్తున్నాను. ఇది నా రీ ఎంట్రీ చిత్రం’’ అని అన్నారు కొరియోగ్రాఫర్ పాల్.

Updated Date - 2021-08-05T23:24:38+05:30 IST