సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pushpa the rise : ట్రైలర్ అనౌన్స్‌మెంట్ వస్తోంది!

ABN, First Publish Date - 2021-11-29T13:47:30+05:30

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప : ది రైజ్’. డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా నుంచి ఇదివరకే విడుదలైన టీజర్, సింగిల్స్ సినిమాపై అంచానల్ని ఓ రేంజ్ లో పెంచాయి. త్వరలో 5వ సింగిల్ కూడా వచ్చేస్తోంది. ఇక ఇప్పుడు ట్రైలర్ కు సమయమైంది. దాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయాన్ని ఈ రోజు (సోమవారం) అనౌన్స్ చేయబోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప : ది రైజ్’. డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా నుంచి ఇదివరకే విడుదలైన టీజర్, సింగిల్స్ సినిమాపై అంచానల్ని ఓ రేంజ్ లో పెంచాయి. త్వరలో 5వ సింగిల్ కూడా వచ్చేస్తోంది. ఇక ఇప్పుడు ట్రైలర్ కు సమయమైంది. దాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయాన్ని ఈ రోజు (సోమవారం) అనౌన్స్ చేయబోతున్నారు. దానికి ఉదయం 11:07కి ముహూర్తం నిర్ణయించారు.


అభిమానులు పండగచేసుకొనే రేంజ్ లో ‘పుష్ప’ కోసం మాస్ ట్రైలర్ ను కట్ చేశారట సుకుమార్ టీమ్. ఆల్రెడీ టీజర్ విజువల్స్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతోందనే హింటిచ్చిన మేకర్స్.. ఈ ట్రైలర్ తో గూస్ బంప్స్ తెప్పిస్తారనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ మాస్ అవతారం నెవర్ బిఫోర్ రేంజ్ లో ఉండబోతోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్ విలన్స్ గా అలరించబోతున్న ఈ సినిమా.. ఎన్ని రికార్డుల్ని సెట్ చేస్తుందో.. ఈ ట్రైలర్ ను బట్టే ఊహించవచ్చు. 



Updated Date - 2021-11-29T13:47:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!