`పుష్ప` రిలీజ్ డేట్ ఫిక్స్!

ABN , First Publish Date - 2021-01-28T16:21:27+05:30 IST

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ త్వరలో తన అభిమానులను థియేటర్లలో కలవబోతున్నాడు.

`పుష్ప` రిలీజ్ డేట్ ఫిక్స్!

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ త్వరలో తన అభిమానులను థియేటర్లలో కలవబోతున్నాడు. తన `పుష్ప` సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించాడు. సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. రష్మికా మందన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 


ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని బన్నీ ట్విటర్ ద్వారా తెలిపాడు. `ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి `పుష్ప` సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ ఏడాది మిమ్మల్నందరినీ థియేటర్లలో కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సుకుమార్, దేవిశ్రీప్రసాద్‌తో కలిసి మరోసారి మేజిక్ చేస్తానని ఆశిస్తున్నా` అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.Updated Date - 2021-01-28T16:21:27+05:30 IST