'పుష్ప': భారీ రేంజ్‌లో ఓవర్సీస్ రిలీజ్‌కు ప్లాన్

ABN , First Publish Date - 2021-10-16T18:03:59+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పార్ట్ 1 పాన్ 5 భాషల్లో, డిసెంబర్ 17న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

'పుష్ప': భారీ రేంజ్‌లో ఓవర్సీస్ రిలీజ్‌కు ప్లాన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పార్ట్ 1 పాన్ 5 భాషల్లో, డిసెంబర్ 17న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీని ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా భారీ లెవెల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. యూఎస్ మార్కెట్‌లో 'పుష్ప' సినిమాను అన్ని భాషల్లో హంసిని ఎంటర్టైన్మెంట్స్ - క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారట. డిసెంబర్ 16 నుంచే ప్రీమియర్స్‌తో ఈ సినిమా విదేశాలలో సందడి చేయనుంది. కాగా ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నారు. 

Updated Date - 2021-10-16T18:03:59+05:30 IST