సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మారేడుమిల్లిలో 'పుష్ప'రాజ్‌ పోరాటాలు

ABN, First Publish Date - 2021-09-06T15:55:45+05:30

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప చిత్రం షూటింగ్‌ మరోసారి తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో జరుగుతోంది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్‌ కోసం ఇటీవల చిత్రబృందం మారేడుమిల్లి అటవీ ప్రాంతాలకు వెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప చిత్రం షూటింగ్‌ మరోసారి తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో జరుగుతోంది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్‌ కోసం ఇటీవల చిత్రబృందం మారేడుమిల్లి అటవీ ప్రాంతాలకు వెళ్లింది. అక్కడ హీరో, ఇతర పాత్రధారులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ నెలాఖరు వరకూ ఉంటుందని, ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తవుతుందని చిత్రవర్గాల నుంచి సమాచారం. ఇటీవల విడుదలైన 'దాక్కో దాక్కో మేక’ పాటకు అనూహ్య స్పందన లభించిన 50 మిలియన్‌ వ్యూస్‌ను క్రాస్‌ చేసిన సంగతి  తెలిసిందే!  మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియాతో కలిసి నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. రష్మిక మందాన కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ స్వరకర్త. క్రిస్మస్‌కు సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 




Updated Date - 2021-09-06T15:55:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!