Pushpa: సమంత స్పెషల్ సాంగ్ ఇప్పటిది కాదా..!
ABN , First Publish Date - 2021-12-29T16:15:58+05:30 IST
'పుష్ప' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా' అనే స్పెషల్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,రష్మిక మందన్న జంటగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన
'పుష్ప' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా' అనే స్పెషల్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,రష్మిక మందన్న జంటగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప: ది రైజ్ పార్ట్ 1' ఇటీవల వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వసూళ్ళ పరంగా ఊహించని మ్యాజిక్ ఫిగర్స్‌ను టచ్ చేసిన ఈ సినిమా దూకుడుకు ఇప్పట్లో బ్రేకులు పడే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ టూర్స్ ఏర్పాటు చేశారు. అన్నీ ఇండస్ట్రీలల్లో సక్సెస్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్రబృదం హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్‌ను నిర్వహిచింది. ఇందులో భాగంగా సమంత నటించిన 'ఊ అంటావా.. పాట వెనకున్న ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు సుకుమార్ వెల్లడించారు.
ఈ పాట రాసింది ప్రముఖ సాహిత్య రచయిత చంద్రబోస్. ఆయన ఈ పాటను నాలుగేళ్ళక్రితమే రాసి సుకుమార్‌కు వినిపించారట. సుక్కూకి ఈ పాట విపరీతంగా నచ్చినప్పటికి ఈ నాలుగేళ్ళలో ఉపయోగించుకునే అవకాశం రాలేదని, ఇప్పుడు పుష్ప పార్ట్ 1కు వచ్చిందని తెలిపారు. అంతేకాదు, ఈ పాటను ఎవరికీ ఇవ్వొద్దని కూడా సుకుమార్..చంద్రబోస్‌తో అప్పుడే చెప్పారట. ఇక ఇదే సందర్భంగా ఈ సాంగ్‌లో బన్నీతో కలిసి మాస్ స్టెప్పులతో అలరించిన సమంత గురించి సుకుమార్ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
