పుష్ప... జూలైలో!

ABN , First Publish Date - 2021-06-23T06:25:16+05:30 IST

రష్మికా మందన్న ముంబైలో ఉన్నారు. ప్రస్తుతం హిందీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. జూలై తొలి వారంలో తెలుగు సినిమా సెట్స్‌కు వస్తున్నారట....

పుష్ప... జూలైలో!

రష్మికా మందన్న ముంబైలో ఉన్నారు. ప్రస్తుతం హిందీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. జూలై తొలి వారంలో తెలుగు సినిమా సెట్స్‌కు వస్తున్నారట. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరో 40 రోజులు చిత్రీకరణ చేస్తే... తొలి భాగం పూర్తవుతుంది. జూలై తొలి వారంలో తాజా షెడ్యూల్‌ ప్రారంభించి ఆగస్టుకు బ్యాలెన్స్‌ వర్క్‌ పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఇందులో అల్లు అర్జున్‌, రష్మికపై కీలక సన్నివేశాలతో ఓ పాటను తెరకెక్కించనున్నారని టాక్‌. ‘పుష్ప’ కాకుండా తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, హిందీలో ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌ బై’ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు.  


Updated Date - 2021-06-23T06:25:16+05:30 IST