Pushpa: 'దాక్కో దాక్కో మేక' ..వీడియో సాంగ్ వచ్చేసింది..

ABN , First Publish Date - 2021-12-30T17:45:48+05:30 IST

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జు, రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప: ది రైజ్ పార్ట్ 1'. తాజాగా ఈ సినిమా నుంచి 'దాక్కో దాక్కో మేక' అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ వదిలారు.

Pushpa: 'దాక్కో దాక్కో మేక' ..వీడియో సాంగ్ వచ్చేసింది..

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జు, రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప: ది రైజ్ పార్ట్ 1'. తాజాగా ఈ సినిమా నుంచి 'దాక్కో దాక్కో మేక' అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ వదిలారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్‌కు ముందు కూడా 'పుష్ప' సినిమా నుంచి వచ్చిన మొదటి పాట కూడా 'దాక్కో దాక్కో మేక'నే. ఈ సాంగ్ మూవీలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదలైన ఈ సాంగ్ వీడియో యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఇటీవల భారీ స్థాయిలో విడుదలై అన్నీ భాషలలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఊహించని విధంగా వసూళ్ళు రాబడుతోంది. కాగా, ఈ మూవీ సీక్వెల్‌ను వచ్చే ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు. 



Updated Date - 2021-12-30T17:45:48+05:30 IST