Pushpa: బన్నీ బాలీవుడ్‌లో నిలబడినట్టేనా..?

ABN , First Publish Date - 2021-12-29T14:15:12+05:30 IST

బన్నీ బాలీవుడ్‌లో నిలబడినట్టేనా..? ప్రస్తుతం ఇదే మాట ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప: ది రైజ్ పార్ట్ 1'.

Pushpa: బన్నీ బాలీవుడ్‌లో నిలబడినట్టేనా..?

బన్నీ బాలీవుడ్‌లో నిలబడినట్టేనా..? ప్రస్తుతం ఇదే మాట ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప: ది రైజ్ పార్ట్ 1'. గతవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 భాషలలో రిలీజైంది. ఊహించని విధంగా వసూళ్ళు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. అయితే, హిందీలో ఈ సినిమాకు సరైన ప్రమోషన్స్ నిర్వహించలేకపోయారు. దాంతో అల్లు అర్జున్ మొదటి స్ట్రైట్ సినిమాగా బాలీవుడ్‌లో రిలీజ్ చేసిన 'పుష్ప పార్ట్ 1'కు అన్నీ రకాలుగా గట్టి దెబ్బపడుతుందని అందరూ మాట్లాడుకున్నారు. కానీ, తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో భారీ స్థాయిలో వసూళ్ళు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే, హిందీలో కూడా ఈ సినిమా వసూళ్ళ పరంగా సత్తా చాటిందని మేకర్స్ చెబుతున్నారు. దాంతో బాలీవుడ్‌లో ప్రభాస్ తర్వాత భారీ హిట్ అందుకున్న హీరోగా ఇప్పుడు అల్లు అర్జున్ నిలబడ్డాడని చెప్పుకుంటున్నారు. కాగా, దీని సీక్వెల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టబోతున్నారు. 

Updated Date - 2021-12-29T14:15:12+05:30 IST