‘రక్తకన్నీరు’ చిత్ర నిర్మాతకు మంత్రి వర్గంలో చోటు

ABN , First Publish Date - 2021-08-05T00:59:51+05:30 IST

ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై మంత్రి మండలిలో నిర్మాత మునిరత్నం నాయుడుకు కూడా అవకాశం కల్పించారు. ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కడంపై తెలుగు చలన చిత్ర నిర్మాతల

‘రక్తకన్నీరు’ చిత్ర నిర్మాతకు మంత్రి వర్గంలో చోటు

ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై మంత్రి మండలిలో నిర్మాత మునిరత్నం నాయుడుకు కూడా అవకాశం కల్పించారు. ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కడంపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఆనందాన్ని వ్యక్తం చేసింది. మునిరత్నం నాయుడు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో సభ్యులుగా ఉన్నారు. ఆయన ఉపేంద్రతో ‘రక్తకన్నీరు’ చిత్రంతో పాటు కన్నడలో ‘కటారి వీర శూర సుందరాంగి’ అనే సినిమాలను నిర్మించారు. ఇటీవల ఆయన బెంగళూరులో అత్యంత సంపన్న ప్రాంతంగా భావించే ఆర్ఆర్ నగర్ ఏరియా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 


‘‘కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంత్రి మండలిలో మంత్రిగా నియమితులైన మునిరత్నం గారు, తన పదవిని సమర్ధవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తూ ఆయనకు కౌన్సిల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన ప్రజల కొరకు చేపట్టే అన్ని పనుల్లో విజయం కలగాలని కోరుచున్నట్లుగా..’’ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది.

Updated Date - 2021-08-05T00:59:51+05:30 IST