సాహస నిర్మాత ఎమ్మెస్ రాజు...
ABN , First Publish Date - 2021-01-31T15:50:19+05:30 IST
తెలుగు చిత్రపరిశ్రమలో నిర్మాత ఎమ్మెస్ రాజుది సాహస ప్రయాణం.

తెలుగు చిత్రపరిశ్రమలో నిర్మాత ఎమ్మెస్ రాజుది సాహస ప్రయాణం. అద్భుత విజయాలే కాదు ఘోర పరాజయాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. ఏ నిర్మాత చేయని సాహసాలు ఆయన చేశారు. ఎన్నోసార్లు కింద పడ్డారు. పడిన ప్రతిసారీ రెట్టించిన ఉత్సాహంతో పైకి లేచి, సూపర్ హిట్ సినిమాలు తీశారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనరుపై ఎమ్మెస్ రాజు అందించిన మరో హిట్ చిత్రం ‘మనసంతా నువ్వే’. విక్టరీ వెంకటేశ్‌తో తీసిన ‘దేవీపుత్రుడు’ ఎమ్మెస్ రాజును ఆర్ధికంగా దెబ్బ తీయడమే కాకుండా... పంపిణీదారులు నష్టపోయారన్న విమర్శను ఎదుర్కొన్నారు.
దాంతో తక్కువ బడ్జెట్‌తో సినిమా తీసి, భారీ విజయం అందుకోవాలన్న కసితో రాజు నిర్మించిన చిత్రం ‘మనసంతా నువ్వే’. ఉదయకిరణ్ ఈ చిత్రంతో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో వి.ఎన్.ఆదిత్య దర్శకుడిగా పరిచయం అయ్యారు. ‘మనసంతా నువ్వే’ సినిమా భారీ విజయం సాధించడంతో ‘దేవీపుత్రుడు’ వల్ల ఆర్ధికంగా దెబ్బతిన్న పంపిణీదారులకు డబ్బు తిరిగి చెల్లించేశారు రాజుగారు.
