ఆ బయోపిక్కుకి వస్తోన్న రెస్పాన్స్‌తో నిర్మాత హ్యాపీ

ABN , First Publish Date - 2021-05-15T00:56:52+05:30 IST

చాలా మంది ఈ మూవీకి రాజేంద్ర ప్రసాద్‌గారిని తీసుకోవచ్చుగా అని అడిగారు. నాకు మాత్రం కొత్తవారికి అవకాశం కల్పించాలని అనిపించింది. సెవెన్ హిల్స్ బ్యానర్ నుంచి అందరి బంధువయా మూవీతో స్టార్ట్ చేశాం. ఇప్పుడు

ఆ బయోపిక్కుకి వస్తోన్న రెస్పాన్స్‌తో నిర్మాత హ్యాపీ

‘బట్టల రామస్వామి బయోపిక్కు చిత్రానికి హిట్ టాక్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు ఆ చిత్ర నిర్మాత సతీష్ కుమార్. అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక్ జైన్, లావణ్య రెడ్డి, భద్రం, ధనరాజ్ నటీనటులుగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సతీష్ కుమార్.ఐ, రామ్ వీరపనేనిలు కలసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. ఈ చిత్రం శుక్రవారం (మే 14) జీ5 ఓటీటీలో డైరెక్ట్‌గ రిలీజైంది. జీ 5 ఓటీలో ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుండటంతో చిత్ర నిర్మాతలలో ఒకరైన సతీష్ కుమార్ మీడియాకు తన సంతోషాన్ని తెలియజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘జీ 5 ఓటీటీలో విడుదలైన ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ చిత్రానికి హిట్ టాక్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదములు. ఈ చిత్రాన్ని జీ5 ఓటీటీలో రిలీజ్ అవడానికి ముఖ్యకారకులైన మ్యాంగో రామ్‌గారికి ధన్యవాదాలు. ఈ మూవీ డైరెక్టర్ రామ్ నారాయణ్ నాకు తమ్ముడుతో సమానం. నా బ్యానర్ నుంచి ఆయన డైరెక్టర్‌గా పరిచయమవడం చాలా హ్యాపీగా ఉంది. నేను జీవితంలో రెండు బలంగా నమ్ముతాను ఒకటి వెంకటేశ్వరస్వామిని, రెండు కథని. ఈ చిత్ర కథ నాకు బాగా నచ్చింది. ఆర్టిస్ట్‌లందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా మంది ఈ మూవీకి రాజేంద్ర ప్రసాద్‌గారిని తీసుకోవచ్చుగా అని అడిగారు. నాకు మాత్రం కొత్తవారికి అవకాశం కల్పించాలని అనిపించింది. సెవెన్ హిల్స్ బ్యానర్ నుంచి అందరి బంధువయా మూవీతో స్టార్ట్ చేశాం. ఇప్పుడు బట్టల రామస్వామి బయోపిక్‌తో పాటు.. గ్లామరస్ యాక్టర్ పూర్ణ యాక్ట్ చేస్తున్న ‘బ్యాక్ డోర్’ మూవీని ప్రజంట్ చేస్తున్నాం. ఆ మూవీ కూడా చిత్రీకరణ పూర్తయింది. ఇంకా పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ఉగాది పర్వదినాన కొత్త మూవీ ఒకటి స్టార్ట్ చేశాం. కోవిడ్ కారణంగా చిత్రీకరణకు బ్రేక్ వేశాం. మా బ్యానర్‌లో వచ్చిన ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’’ అని తెలిపారు. 

Updated Date - 2021-05-15T00:56:52+05:30 IST