సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఎక్స్‌క్లూజివ్‌: హీరోగా మరో నిర్మాత తనయుడు

ABN, First Publish Date - 2021-01-22T01:26:10+05:30

హీరోల వారసులే కాదు.. నిర్మాతల వారసులు కూడా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద తమ సత్తా చాటుతూ స్టార్‌ హీరోలుగా చలామణీ అవుతున్నారు. అందులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోల వారసులే కాదు.. నిర్మాతల వారసులు కూడా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద తమ సత్తా చాటుతూ స్టార్‌ హీరోలుగా చలామణీ అవుతున్నారు. అందులో వెంకటేష్‌, అల్లు అర్జున్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ వంటి వారు ఇప్పుడు ఎటువంటి స్టేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారో తెలియంది కాదు. ఇప్పుడు వీరి బాటలోనే మరో ప్రముఖ నిర్మాత తనయుడు తన ప్రతిభను చాటేందుకు రెడీ అవుతున్నారు. బాలకృష్ణతో 'కృష్ణబాబు', ప్రభాస్ తో 'అడవి రాముడు', ఎన్టీఆర్ తో 'అల్లరి రాముడు' వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత చంటి అడ్డాల.. ఇప్పుడు తన తనయుడిని హీరోగా పరిచయం చేసేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఆ వివరాలు ఎక్స్‌క్లూజివ్‌గా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అందిస్తోంది.


నిర్మాత చంటి అడ్డాల తనయుడిని హీరోగా లాంఛ్ చేయబోతోన్న దర్శకుడు మరెవరో కాదు.. 'కొత్త బంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ముకుందా'.. ప్రస్తుతం 'నారప్ప' సినిమాలతో దర్శకుడిగా తన స్టామినా ఏంటో నిరూపించుకున్న శ్రీకాంత్ అడ్డాల. అలాగే ఈ మూవీని నిర్మించబోతోన్నది ఎవరంటే.. హిట్‌ చిత్రాలను నిర్మిస్తూ.. సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా పేరుగాంచిన బన్నీ వాసు. 'కూచిపూడి వారి వీధిలో' అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం.. ఆద్యంతం గోదావరి జిల్లాలలో సాగే కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుంది. అతి త్వరలోనే.. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Updated Date - 2021-01-22T01:26:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!