సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Priyanka-Jawalkar: బోల్డ్ క్యారెక్టర్స్‌కు రెడీ..

ABN, First Publish Date - 2021-12-07T13:14:44+05:30

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ బోల్డ్ క్యారెక్టర్స్ చేసేందుకు రెడీ అంటోంది. 'టాక్సీవాలా' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ప్రియాంక..'తిమ్మరుసు', 'ఎస్.ఆర్. కల్యాణ మంటపం'

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ బోల్డ్ క్యారెక్టర్స్ చేసేందుకు రెడీ అంటోంది. 'టాక్సీవాలా' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ప్రియాంక..'తిమ్మరుసు', 'ఎస్.ఆర్. కల్యాణ మంటపం' వంటి సినిమాలలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం శివకందుకూరికి జంటగా 'గమనం' సినిమాలో నటించింది ప్రియాంక జవాల్కర్. క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ - కల్కి ప్రొడక్షన్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రియ ప్రధాన పాత్రను పోషించారు. ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రియాంక జవాల్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా "బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేయాలనుకుంటున్నాను. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్స్ చేయడానికైనా అభ్యంతరం లేదు" అని తెలిపింది. ఓపెన్‌గా చెప్పింది కాబట్టి ప్రియాంక జవాల్కర్‌కు అలాంటి కథల్లో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి.  

Updated Date - 2021-12-07T13:14:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!