జీవితం అసంపూర్ణంగానే ఉంది: ప్రియాంక

ABN , First Publish Date - 2021-06-13T06:17:31+05:30 IST

ప్రియాంక చోప్రా గ్లోబల్‌స్టార్‌గా ఎదిగినప్పటికీ తను సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయనీ, కనే కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం కృష్టి చేస్తానని చెబుతున్నారు. కథానాయికగా బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లో గుర్తింపు సాధించినప్పటికీ ఇంకా తన జీవితం అసంపూర్ణంగా ఉందని అంటున్నారామె!

జీవితం అసంపూర్ణంగానే ఉంది: ప్రియాంక

ప్రియాంక చోప్రా గ్లోబల్‌స్టార్‌గా ఎదిగినప్పటికీ తను సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయనీ, కనే కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం కృష్టి చేస్తానని చెబుతున్నారు. కథానాయికగా బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లో గుర్తింపు సాధించినప్పటికీ ఇంకా తన జీవితం అసంపూర్ణంగా ఉందని అంటున్నారామె! అభిమానులకు స్ఫూర్తిగా నిలిచిన ప్రియాంక కొటేషన్స్‌గా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 


1. జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని వివాహం చేసుకున్నా, మీకు ఆర్థికపరంగా స్వతంత్రంగా ఉండాలి, 


2. గ్లాస్‌ స్లిప్పర్‌ను పిండడానికి ప్రయత్నించవద్దు. దానికి బదులుగా గ్లాస్‌ సీలింగ్‌ను ముక్కలు చేయండి. 


3. మహిళలకు ఆశయం ఉండడం ఏమన్నా తప్పా? 


4. జీవితం మనల్ని ఎటువైపు మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలీదు. అందుకే మిమ్మల్ని, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులను జాగ్రత్తగా చూసుకునే కెపాసిటీ ఉండాలి. 


5. జీవితంలో కదలికలు ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రక్రియలో మీరు ఎప్పుడూ మెరుపులా ఉండాలి. 


6. మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీరేంటో ఓసారి ఆలోచించండి, మీలో ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి. 


7. నా పట్ల నాకున్న నమ్మకమే నా బలం. అందరికీ ఆ విషయాన్నే సజెస్ట్‌ చేస్తారు.


8. మీకు ఏమి కావాలో తెలియకపోయినా ఫర్వాలేదు. కానీ ఓ క్లారిటీ ఉండాలి. 


9. నిజమేంటో తెలుసుకోవడం, దాని కోసం నిలబడడంలోనే మీ ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. 


10. నలుపు, గోదుమ, తెలుసు, పసుపు.. ఇలా ఎందుకు మనం ఎప్పుడూ రంగుల గురించి మాట్లాడుతున్నాం? నేనొక అమ్మాయిని. ప్రపంచ సమాజాన్ని నమ్ముతున్నాను. 


11. ఒంటరి ప్రయాణానికి ఎప్పుడూ భయపడవద్దు. మీ జయాపజయాలకు బాధ్యత వహించడం మిమ్మల్ని

బలోపేతం చేస్తుంది. 


12. మీరు సంపూర్ణ మహిళ కావచ్చు. మామూలుగా ఉండండి, కఠినంగా ఉండండి కానీ ఫెమినిటీని కోల్పోవద్దు. 


13. మీ ప్రతిభను విశ్వసిస్తే.. పరివర్తన సులభంగా వస్తుంది. 


14. ఓ మహిళగా  గుర్తింపు పొందాలంటే నాలోని బెస్ట్‌ని బయట పెట్టాలనుకుంటున్నా. నేను ఆ దిశగానే ప్రయాణిస్తా.
Updated Date - 2021-06-13T06:17:31+05:30 IST