అక్షయ్‌కు ప్రధాని లేఖ
ABN , First Publish Date - 2021-09-13T05:40:46+05:30 IST
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ తల్లి అరుణా భాటియా ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఆయనకు ప్రధాని మోదీ శనివారం లేఖ రాశారు....
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ తల్లి అరుణా భాటియా ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఆయనకు ప్రధాని మోదీ శనివారం లేఖ రాశారు. అక్షయ్‌కుమార్ ఎదుగుదలలో ఆయన తల్లి పాత్ర మరువలేనిదని ప్రధాని కొనియాడారు. ‘‘తల్లిగారిపై మీకున్న ప్రేమ నన్ను కదిలించింది. తల్లితండ్రులు నేర్పిన విలువలు, సంస్కారం వల్లే సినీ రంగంలో నీదైన ముద్రవేశావు. కష్టకాలంలో తల్లి వెన్నుదన్నుగా నిలవబట్టే ఈనాడు దేశం గర్వించే నటుల్లో ఒకరిగా ఎదిగావు. తను ఇచ్చిన ప్రేరణతోనే సమాజం కోసం పలు సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. అరుణా భాటియా మరణించిన రోజునే అక్షయ్‌కుమార్‌ను ఫోన్‌లో పరామర్శించినట్టు మోదీ అందులో తెలిపారు.