అహంకారమే అలంకారం

ABN , First Publish Date - 2021-11-16T05:52:35+05:30 IST

సుమంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్‌’. రఘువీర్‌ గోరిపర్తి, సుజన్‌ యరబోలు నిర్మాతలు. ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు...

అహంకారమే అలంకారం

సుమంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్‌’. రఘువీర్‌ గోరిపర్తి, సుజన్‌ యరబోలు నిర్మాతలు. ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. తొలి సన్నివేశానికి శరణ్‌ కొప్పిశెట్టి క్లాప్‌ ఇచ్చారు. చందూ మొండేటి స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అహం అంటే.. నేను అనే స్వార్థం. 


అహమే అలంకారం అనుకునే ఓ వ్యక్తి కథ ఇది. అందులోంచి ఎలా బయటపడ్డాడు. తనని తాను తెలుసుకునే ప్రయత్నం ఎలా చేశాడన్నది తెరపై చూపిస్తున్నామ’’న్నారు. ఈ సందర్భంగా కాన్సెప్ట్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. శ్రీరామ్‌ మద్దూరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వరుణ్‌ అంకర్ల.


Updated Date - 2021-11-16T05:52:35+05:30 IST