శ్రద్ధా, పూజా, శృతి, కృతి.. ఇప్పుడు దీపికాకు తినిపించిన ప్రభాస్
ABN , First Publish Date - 2021-12-14T01:47:46+05:30 IST
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరొక సంచలనం. ‘బాహుబలి’ తర్వాత ఈ పేరుకి ప్రపంచమంతా ‘సాహో’ అనేసింది. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినా.. ప్రభాస్‌లో మాత్రం ఎటువంటి గర్వం ఉండదు. చాలా కూల్‌గా.. ఎప్పుడూ నవ్వుతూ సరదాసరదాగా ఉంటారు. అంతే కాదండోయ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరొక సంచలనం. ‘బాహుబలి’ తర్వాత ఈ పేరుకి ప్రపంచమంతా ‘సాహో’ అనేసింది. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినా.. ప్రభాస్‌లో మాత్రం ఎటువంటి గర్వం ఉండదు. చాలా కూల్‌గా.. ఎప్పుడూ నవ్వుతూ సరదాసరదాగా ఉంటారు. అంతే కాదండోయ్.. తనతో పాటు సినిమాలో చేసే హీరోయిన్లను.. ప్రభాస్ స్వీట్ సర్ప్రైజ్ చేస్తుంటారు. తన ఇంటి వంటకాలను రుచి చూపించి.. అతిథి మర్యాదలతో వారిని ఫిదా చేస్తుంటారు. ఇలా ఫిదా అయిన వారిలో శ్రద్దా కపూర్, శృతిహాసన్, పూజా హెగ్డే, కృతిసనన్ ఉండగా.. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి కొత్తగా మరో హీరోయిన్ చేరారు.
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రీసెంట్గా ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌లోకి ప్రభాస్‌తో పాటు హీరోయిన్ దీపికా పదుకొనె కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర లొకేషన్‌కి.. ఎప్పటిలానే ప్రభాస్ తన ఇంటి వంటకాలను తెప్పించి.. దీపికతో తినిపించారు. ఈ విషయం స్వయంగా దీపికానే సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రభాస్ అతిథి మర్యాదలకు స్టన్ అయిన దీపికా.. అతను తెప్పించిన వంటకాలన్నింటిని ఫొటో తీసి.. ప్రభాస్, నాగ్ అశ్విన్ పేర్లతో ట్యాగ్ చేసింది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు.. ప్రభాస్ పేరు ట్రెండ్ అవుతోంది.