'జాంబిరెడ్డి' ట్రైలర్‌ విడుదల చేసిన ప్రభాస్‌

ABN , First Publish Date - 2021-01-03T16:04:56+05:30 IST

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జాంబిరెడ్డి' ట్రైలర్ ను ప్రభాస్ విడుదల చేశారు.

'జాంబిరెడ్డి' ట్రైలర్‌ విడుదల చేసిన ప్రభాస్‌

కరోనా వైరస్‌ బ్యాడ్‌ అయితే దాని డాడ్‌ ఎవరో తెలుసా? అని అడుగుతున్నాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న చిత్రం 'అ!'ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తోన్న మూడో చిత్రం 'జాంబిరెడ్డి'. సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు. కానీ ఈ సంక్రాంతికి జాంబీలు వస్తున్నారు అంటూ సంక్రాంతికి 'జాంబిరెడ్డి' సినిమా విడుదలవుతుందని చెప్పారు. యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌ శేఖర్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలవుతుందా లేక.. ఓటీటీలో విడుదలవుతుందా? అని తెలియడం లేదు. 'జాంబి రెడ్డి' సినిమా ట్రైలర్‌ను రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.  తేజ సజ్జా హీరోగా నటించాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రశాంత్‌ వర్మ ఈ కథను రాసుకున్నాడు.ఈ దీనికి ఫ్యాక్షన్‌ జోడించి అందులో నుండి కామెడీ జనరేట్‌ చేసినట్లు ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తుంది. మరి సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించనుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.



Updated Date - 2021-01-03T16:04:56+05:30 IST