సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రభాస్‌తో ‘కె.జి.యఫ్‌’ హీరోయిన్‌?

ABN, First Publish Date - 2021-05-04T10:27:04+05:30

ప్రభాస్‌తో ‘కె.జి.యఫ్‌’ హీరోయిన్‌ శ్రీనిధీ శెట్టి నటించనున్నారట. అయితే, వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం లేదు. కేవలం ఓ పాట చేస్తారట....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభాస్‌తో ‘కె.జి.యఫ్‌’ హీరోయిన్‌ శ్రీనిధీ శెట్టి నటించనున్నారట. అయితే, వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం లేదు. కేవలం ఓ పాట చేస్తారట. ‘కె.జి.యఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ప్రభాస్‌ చేస్తున్న సినిమా ‘సలార్‌’. ఇందులో శ్రుతీ హాసన్‌ కథానాయిక. సినిమాలో ఓ ప్రత్యేక గీతానికి చోటుంది. అందులో ప్రభాస్‌తో శ్రీనిధీ శెట్టి స్టెప్పులు వేయనున్నారట. ఈ పాట గురించి ఆమెకు దర్శకుడు వివరించగా... వెంటనే ఓకే చెప్పారట. ఈ ఏడాది ఆఖరులో స్పెషల్‌ సెట్‌లో పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌లో తదుపరి షెడ్యూల్‌ స్టార్ట్‌ చేయాలనుకున్నారు. అయితే, పరిస్థితులను బట్టి అప్పుడు నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది వేసవి సందర్భంగా ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-05-04T10:27:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!