జైపూర్ మహరాణి గాయత్రీదేవిగా నటించాలని ఉంది : పూజా హెగ్డే

ABN , First Publish Date - 2021-10-18T19:55:52+05:30 IST

టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లో పూజా హెగ్డే పేరే ముందుంది. వరుసగా స్టార్ హీరోల సరసన కథానాయికగా నటిస్తోన్న అమ్మడి సినిమా లైనప్ చూస్తే మతిపోతుంది. ఇటీవల అఖిల్ తో కలిసి నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీ హిట్ అవడంతో పూజా విజయోత్సాహంతో ఉంది. అనుష్క, నయనతార, కాజల్ స్థాయిలోనే ఆమె స్టార్ డమ్ వెలుగుతోందిప్పుడు.

జైపూర్ మహరాణి గాయత్రీదేవిగా నటించాలని ఉంది : పూజా హెగ్డే

టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లో పూజా హెగ్డే పేరే ముందుంది. వరుసగా స్టార్ హీరోల సరసన కథానాయికగా నటిస్తోన్న అమ్మడి సినిమాల లైనప్ చూస్తే మతిపోతుంది. ఇటీవల అఖిల్ తో కలిసి నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీ హిట్ అవడంతో పూజా విజయోత్సాహంతో ఉంది. అనుష్క, నయనతార, కాజల్ స్థాయిలోనే ఆమె స్టార్ డమ్ వెలుగుతోందిప్పుడు. అయితే తనకి గ్లామర్ రోల్స్ కన్నా లేడీ ఓరియెంటెడ్ మూవీస్,  నిజజీవిత కథల్లో నటించడం ఇష్టమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషంగా మారింది. ఎవరైనా అలాంటి కథలతో ముందుకొస్తే నటించడానికి ఎప్పుడూ ముందుటానని చెప్పింది. ప్రస్తుతం పలువురు నిర్మాతలతో అలాంటి కథలకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలిపింది. 



ఇక బయోపిక్స్ విషయానికొస్తే తనకి.. జైపూర్ మహరాణి గాయత్రీదేవి జీవిత కథలో నటించాలని ఉందని తెలిపింది. జైపూర్ మహారాజు స్వామీ మాన్ సింగ్ 2 భార్య అయిన గాయత్రీదేవి పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేశారు. అలాగే ఎమర్జెన్సీ టైమ్ లో జైలుకి కూడా వెళ్ళారు. అలాంటి ధీరోదాత్తురాలైన గాయత్రీదేవి పాత్ర చేయమని ఎవరైనా తనని సంప్రదిస్తే తప్పకుండా చేస్తానని పూజా అంటోంది. మరి పూజా హెగ్డే తో ఏ నిర్మాత ఆ సినిమా తీస్తారో చూడాలి. 

Updated Date - 2021-10-18T19:55:52+05:30 IST