సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

డబ్బింగ్‌ చెబుతున్న బుట్టబొమ్మ

ABN, First Publish Date - 2021-09-18T04:58:36+05:30

తెలుగు చిత్రాల్లో కనిపించడంతో పాటు తన గొంతే వినిపించాలని తపించే బాలీవుడ్‌ హీరోయిన్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. అఖిల్‌ అక్కినేని సరసన నటించిన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ చిత్రంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు చిత్రాల్లో కనిపించడంతో పాటు తన గొంతే వినిపించాలని తపించే బాలీవుడ్‌ హీరోయిన్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. అఖిల్‌ అక్కినేని సరసన నటించిన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ చిత్రంతో తన సొంత గొంతుతో ప్రేక్షకులను అలరించడానికి పూజ సిద్ధమవుతున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. బన్నీ వాసు, వాసు వర్మ ఈ చిత్రానికి నిర్మాతలు. ‘మేం విడుదల చేసిన ప్రతి అప్డేట్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇటీవల విడుదలైన ‘లెహరాయి’ పాటకు కూడా యూ ట్యూబ్‌లో అనూహ్య స్పందన వస్తోంది. అక్టోబర్‌ 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని నిర్మాతలు చెప్పారు.

Updated Date - 2021-09-18T04:58:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!