పిన్నీసు సొగసు!

ABN , First Publish Date - 2021-11-29T11:14:33+05:30 IST

సినిమావాళ్లు ఏం చేసినా ఫ్యాషనే. షర్టుపై టీ షర్టు వేసుకుంటే ట్రెండు. ఫ్యాంటు మీద ఫ్యాంటు ధరిస్తే... అది నయా లుక్‌. జీను ఎంత చిరిగితే అంత అందం...

పిన్నీసు సొగసు!

సినిమావాళ్లు ఏం చేసినా ఫ్యాషనే. షర్టుపై టీ షర్టు వేసుకుంటే ట్రెండు. ఫ్యాంటు మీద ఫ్యాంటు ధరిస్తే... అది నయా లుక్‌. జీను ఎంత చిరిగితే అంత అందం. ఏం చేసినా దానికి ఏదో ఓ పేరు పెట్టేసి పాపులర్‌ చేసేస్తుంటారు. చిరిగిన జీన్సు వేసుకోవడాన్ని టోర్న్‌ ఫ్యాషన్‌ అంటారని సినిమావాళ్లు చెబితే గానీ తెలీలేదు. ఇప్పుడు చిరిగిన చోట పిన్నీసు తగిలించడం కూడా ట్రెండ్‌గా మారిపోయింది. ఇదిగో.. ఇక్కడ సమంతని చూడండి. చిరుగుల్ని పిన్నీసుతో కవర్‌ చేసింది. అది కొత్త స్టైల్‌ అట. దీనికి ఏం పేరు పెట్టారో మరి. కథానాయికలు ఇలాంటి దుస్తులు వేసుకోవడం ఇదే కొత్త కాదు. ఇది వరకు కొంతమంది బాలీవుడ్‌ భామలు ఈ తరహా డ్రస్సింగ్‌ స్టైల్‌తో కనిపించారు. సమంతకు మాత్రం ఇదే తొలి ప్రయత్నం. ఈ పిన్నీసు సొగసుల ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Updated Date - 2021-11-29T11:14:33+05:30 IST