సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కరోనాతో సోదరుడిని కోల్పోయిన పియా బాజ్‌పాయ్‌

ABN, First Publish Date - 2021-05-04T21:14:00+05:30

కరోనాతో మనకు కావాల్సినవాళ్లు కళ్ల ముందు చనిపోతుంటే ఏమీ చేయలేకపోతున్నామని, తన కుటుంబంలోనూ అలాంటి ఘటనే జరిగిందని బాధను వ్యక్తం చేసింది హీరోయిన్‌ పియా బాజ్‌పాయ్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ సెకండ్ వేవ్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎంతో మంది ప్రజలు ఆక్సిజన్ లేకుండా, సకాలంలో వైద్య సదుపాయం అందక కన్నుమూస్తున్నారు. మనకు కావాల్సినవాళ్లు కళ్ల ముందు చనిపోతుంటే ఏమీ చేయలేకపోతున్నామని, తన కుటుంబంలోనూ అలాంటి ఘటనే జరిగిందని బాధను వ్యక్తం చేసింది హీరోయిన్‌ పియా బాజ్‌పాయ్‌. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో జరిగింది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన పియా బాజ్‌పాయ్‌ సోదరుడు కరోనా బారినపడ్డాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆయన చనిపోయాడు. తన సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని, అర్జెంట్‌గా వెంటిలేటర్‌ సాయం కావాలని, హాస్పిటల్‌లో బెడ్‌ దొరకడం లేదని సాయం చేయాలని పియా బాజ్‌పాయ్‌ ఉదయం ట్వీట్‌ చేసింది. ఆమె ట్వీట్‌ చేసిన రెండు గంటల వ్యవధిలోనే సోదరుడు చనిపోయాడంటూ మరో ట్వీట్‌ చేసింది. అంతా చూస్తుండగానే కళ్లముందే అన్న ప్రాణాలు పోయాయని బాధను వ్యక్తం చేసింది పియా బాజ్‌పాయ్‌. 

Updated Date - 2021-05-04T21:14:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!