జ్వాలారెడ్డి తర్వాత ‘సీటీమార్‌’ నుంచి పెప్సీ ఆంటీ వస్తోంది

ABN , First Publish Date - 2021-03-20T02:12:20+05:30 IST

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘సీటీమార్‌’. గోపిచంద్

జ్వాలారెడ్డి తర్వాత ‘సీటీమార్‌’ నుంచి పెప్సీ ఆంటీ వస్తోంది

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. సీనియర్‌ నటి భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా విడుదలైన 'జ్వాలారెడ్డి' సాంగ్‌ కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇక 'జ్వాలారెడ్డి' సాంగ్‌ తర్వాత ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌ని వదలబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.


మిల్కీ బ్యూటీ అందాలతో వచ్చిన 'జ్వాలా రెడ్డి' సాంగ్‌ కిక్కు తగ్గకముందే 'సీటీమార్‌'లోని ఐటమ్‌ సాంగ్‌ని వదలబోతున్నారు మేకర్స్‌. 'పెప్సీ ఆంటీ' అంటూ సాగే ఈ పాటలో 'క్రాక్‌'లో భూమ్‌ బద్దల్‌ చేసిన వర్మ హీరోయిన్‌ అప్సరా రాణి మరోసారి కుర్రకారుని ఖుషి చేయనుంది. ఈ మాస్‌ ధమాకా సాంగ్‌ని మార్చి 21 ఉదయం 11 గంటల 17 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. హీటెక్కించే పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌ చూసిన తర్వాత పాట ఎప్పుడెప్పుడు వస్తుందా? అనే ఆత్రుత అప్పుడే నెటిజన్లలో మొదలైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-20T02:12:20+05:30 IST