తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న దర్శకేంద్రుడి 'పెళ్లి సందడి'
ABN , First Publish Date - 2021-01-03T18:07:26+05:30 IST
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `పెళ్లి సందడి`. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది

రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `పెళ్లి సందడి`. 1996 'పెళ్లి సందడి'లో హీరోగా చేసి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇప్పుడు 'పెళ్లి సందడి'లో హీరోగా నటిస్తుండటం విశేషం. కె. కృష్ణమోహన్ రావు సమ్పరణలో ఆర్.కె.ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్‌పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌దేవినేని నిర్మిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా లేటెస్ట్‌గా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాట, ఎనిమిది రోజుల టాకీ పార్ట్ పూర్తయ్యింది. నెక్ట్స షెడ్యూల్‌ను జనవరి 27 నుండి ప్రారంభించనున్నారు. పన్నెండు రోజుల పాటు ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. దశివశక్తి దత్తా, చంద్రబోస్‌లు ఈ పాటలకు సాహిత్యాన్ని అందిస్తున్నారు. సునీల్ కుమార్ నామా, శ్రీధర్ సీపాన, కిరణ్ కుమార్, గౌరీ రోనంకి ఇతర సాంకేతిక వర్గం.