సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మహేశ్ బాబు రిలీజ్ చేసిన 'పెళ్లి సంద D' ట్రైలర్

ABN, First Publish Date - 2021-09-22T16:51:02+05:30

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీలా జంటగా రూపొందుతున్న తాజా చిత్రం 'పెళ్లి సంద D'. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీలా జంటగా రూపొందుతున్న తాజా చిత్రం 'పెళ్లి సంద D'. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. గౌరీ రోనంకీ దర్శకత్వంలో ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ - ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై మాధవీ కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తునారు. గతంలో శ్రీకాంత్‌తో ‘పెళ్లి సందడి’ తీసి భారీ విజయాన్ని అందుకున్న దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ వహించారు.


అంతేకాదు మొదటిసారి రాఘవేంద్రరావు సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ట్రైలర్‌ను మహేశ్ బాబు విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమా అంతా సందడి సందడిగా సాగుతుందనిపిస్తోంది. రోషన్ పర్ఫార్మెన్స్‌తో పాటు డాన్స్, ఫైట్స్ బాగా చేశాడని అర్థమవుతోంది. చూడాలి మరి ఈ 'పెళ్లి సందD' ఆ 'పెళ్లి సందడి'ని మించి భారీ హిట్ సాధిస్తుందా లేదా.



Updated Date - 2021-09-22T16:51:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!