Pawan - Rana: పవన్, రానా మూవీ షూటింగ్ పునః ప్రారంభం
ABN, First Publish Date - 2021-07-26T15:56:29+05:30
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్, సోమవారం నుంచి పునః ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగుతుంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తోన్నఈ సినిమా ఇప్పటికే యాబై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుందని సమాచారం.ఈ షెడ్యూల్‌లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పోలీస్ డ్రెస్‌లో వెనక్కి తిరిగి నిల్చున్న పవన్ కళ్యాణ్ ఫొటోను చిత్ర యూనిట్ విడుదల చేస్తే.. సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్‌గా, రానా రిటైర్డ్ మేజర్ పాత్రలో కనిపిస్తారు. పవన్ జోడీగా నిత్యామీనన్ నటిస్తుంటే రానా సరసన ఐశ్వర్యా రాజేశ్ నటిస్తోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలను అందిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.