సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

`అయ్యప్పన్` రీమేక్.. సెట్స్‌లో పవన్, త్రివిక్రమ్!

ABN, First Publish Date - 2021-01-26T16:56:33+05:30

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. ఇటీవలె `వకీల్ సాబ్` సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన పవన్ తాజాగా `అయ్యప్పనుమ్ కోషియం` రీమేక్‌ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాలో పవన్‌తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకుడు. 


తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. పవన్‌తోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. పవన్ ఎంట్రీకి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ తాజాగా విడుదల చేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  




Updated Date - 2021-01-26T16:56:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!