సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నేరుగా నాకే సాయం చేయండి - పావలా శ్యామల

ABN, First Publish Date - 2021-05-19T05:08:39+05:30

‘‘నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే. అయితే, కొందరు నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకోవడం దారుణం. ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే... నేరుగా నాకే సాయం చేయండి’’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే. అయితే, కొందరు నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకోవడం దారుణం. ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే... నేరుగా నాకే సాయం చేయండి’’ అని పావలా శ్యామల విజ్ఞప్తి చేశారు. తనకు గూగుల్‌ పే, పేటీయం వంటివి లేవని స్పష్టం చేశారు. తనకు మధ్యవర్తులు ఎవరూ లేరని, 9849175713 నెంబర్‌కు ఫోన్‌ చేసి నేరుగా తనకు డబ్బులు అందించాలని కోరారు. ఇంకా పావలా శ్యామల మాట్లాడుతూ నాకు, నా కుమార్తెకు కలిపి ప్రతి నెలా మందులకు రూ.10 వేలు అవుతున్నాయి. నా పేరు చెప్పి ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి. దాతలు నేరుగా నాకే ఇవ్వండి’’ అని అన్నారు.


చిరంజీవి సాయం రూ. లక్ష

పావలా శ్యామలకు చిరంజీవి రూ. లక్షా పదిహేను వందలు సాయం చేశారు. ఆమెకు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) సభ్యత్వం ఇవ్వాల్సిందిగా మంగళవారం ‘మా’ ఈసీ సభ్యులకు ఆ మొత్తాన్ని అందజేశారు. ‘‘గతంలో చిరంజీవి రూ. 2లక్షలు సాయం చేశారు. ఇప్పుడు ‘మా’ నుంచి ప్రతి నెల రూ. 6 వేలు పెన్షన్‌ రూపంలో సాయం అందేలా రూ.1,01,500 ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు’’ అని పావలా శ్యామల అన్నారు.

Updated Date - 2021-05-19T05:08:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!