'సన్నాఫ్ ఇండియా' సాంగ్‌పై పరుచూరి స్పందన
ABN , First Publish Date - 2021-06-17T19:04:31+05:30 IST
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సన్నాఫ్ ఇండియా'. ఇటీవల ఈ సినిమా నుంచి 'జయ జయ మహావీర' లిరికల్ సాంగ్ విడుదలయి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సాంగ్‌పై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన హృదయ స్పందనను ఒక వీడియో ద్వారా తెలిపారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సన్నాఫ్ ఇండియా'. ఇటీవల ఈ సినిమా నుంచి 'జయ జయ మహావీర' లిరికల్ సాంగ్ విడుదలయి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సాంగ్‌పై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన హృదయ స్పందనను ఒక వీడియో ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా.."11వ శతాబ్ధంలో రచింపబడినటువంటి రగువీరా గద్యం 21వ శతాబ్ధంలో, ఈనాడు ప్రేక్షకులు చూడగలుగుతున్నారంటే దానికి 24 ఫ్రేంస్, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ వారిని అభినందించాలి. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం అయినటువంటి ఆ రామస్థుతిని ఇవాళ ప్రేక్షకులు విని ఇంత గొప్ప రామస్థుతి ఉందా అని తెలుసుకోగలుగుతున్నారు అంటే అందుకు కారణం 24 ఫ్రేంస్, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థలు. ఈ చిత్రం నేను చూశాను. ఈ పాటలో వేసిన షాట్స్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ ముగ్గురు మాస్టర్లున్నారు. ఒకరు ఇళయరాజా గారు.. సంగీతంలో మాస్టర్. మోహన్ బాబు గారు నటనలో మాస్టర్.. విష్ణు నిర్మాణంలో మాస్టర్. పక్కన కూర్చుకొని తండ్రిగారి సినిమా ఎలాగైనా సూపర్ హిట్ చేయాలని తపన అతనికుంది. మా సోదరుడు మంచు మోహన్ బాబు గారి చిత్రాన్ని అద్భుతంగా ఆశీర్వదించి, అఖండ విజయాన్ని అందించి మీరందరూ కూడా మళ్ళీ మోహన్ బాబు ఈజ్ మోహన్ బాబు అని నిరూపించాలని కోరుకుంటున్నాను..'సన్నాఫ్ ఇండియా' చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను".. అన్నారు.